Will get hit atleast this time



ఈసారన్నా కొడతాడా లేక పడతాడా ?
బ్రహ్మానందం కొడుకు అన్నపేరుతో హీరో చాన్సు దక్కించుకున్న గౌతమ్ టాలెంట్ ఏంటో మొదటి సినిమా పల్లకిలో పెళ్లి కూతురుతోటే తెలిసిపోయంది. తర్వాత చదువు పేరుతో కొంతకాలం కనబడకుండా పోయి ఆ పాట సినిమాను  జనం మర్చిపోయారు అని నమ్మకం కుదిరాక రెండో సినిమా చేసాడు. ఎంతో మంది నిర్మాతలు తెలిసిన కూడా, తనే స్వయంగా సినిమా తీయగల డబ్బు ఉంది కూడా ఖంగారు పడకుండా తనకొడుకుతో రెండో సినిమా చేసే దమ్మున్న, డబ్బున్న నిర్మాత దొరికే వరకు వెయిట్ చేసిన బ్రహ్మానందం ఈ సినిమాను ఎలాగన్నా హిట్ చేసి తన కొడుకుని కూడా హీరోగా నిలబెట్టాలి అన్న పట్టుదలతో ఉన్నాడు.

అందుకనే సినిమా ఓపెనింగ్ ఆదరకొట్టే లెవెల్లో కాకపోయినా తన పలుకుబడి ఉపయోగించి పెద్దోల్లందరినీ పిలిచాడు. కానీ ఎవరికీ ఈ సినిమా మీద అంచనాలు రాలేదు.ఇక ఇలా కాదని ఆడియో అన్నా ఆదరగోట్టాలని సినిమా పరిశ్రమ లోని పెద్ద పెద్ద కుటుమ్బాలనుండి మనుషులు హాజరయ్యేలాగా చూసాడు. తన రగడ ప్రమోషన లో బిజీ గా ఉన్న నాగార్జున తన కొడుకు నాగచైతన్య తో సహా హాజరయ్యాడు. అలాగే చిరు ఫ్యామిలీ నుండి రామ్ చరణ్, వెంకటేష్ ఫ్యామిలీ నుండి రానా , మోహన్ బాబు ఫ్యామిలీ నుండి విష్ణు, మనోజ్ వచ్చారు. చంద్రబాబు దీక్ష వల్లనేమో నందమూరి ఫ్యామిలీ నుండి ఎవరూ రాలేదు.

ఏది ఏమైనా కనీసం ఈ సినిమా అన్నా హిట్టు కొట్టి గౌతమ్ నిలబడితే హాస్య నటుల కుటుంబాల నుండి వచ్చిన వస్తున్న మిగతా హీరోలకు కొంచెం ఉత్సాహం వస్తుంది.

See here Vareva  Audio Release function gallery :




Share your views...

0 Respones to "Will get hit atleast this time"

Post a Comment

 

© 2010 TollyTown All Rights Reserved Thesis WordPress Theme Converted into Blogger Template by Hack Tutors.info