Will Nagarjuna remains in december success mood



నాగార్జున నిలబెట్టుకుంటాడా ?
ఎప్పటిలాగే డిసెంబర్ లో సినిమా విడుదల అయ్యేలాగ నాగార్జున ప్లాన్ చేసుకున్నాడు. మాస్, కింగ్ సక్సెస్ లతో డిసెంబర్ లో సినిమా విడుదల చెయ్యడం సెంటిమెంట్ గా పెట్టుకున్న నాగార్జున ఈసారి తన " రగడ " మూవీని వదలబోతున్నాడు. కేడి తో దెబ్బతినేసిన తన మిత్రుడు శివప్రసాద్ రెడ్డికి ఎలాగన్నా హిట్ ఇవ్వాలనే తాపత్రయం తో తన ఇంకో మూవీ గగనం ను జనవరికి వాయిదా వేయించి మరీ రగడ చెయ్యబోతున్నాడు. 
ఎప్పటిలాగే ఈ సినిమాలో అనుష్క నటించగా ప్రియమణి ఇంకో హీరోయిన్ గా చేసింది.తమన్ ఇచ్చిన పాటలు ఇప్పటికే జనం లో ఎక్కేసాయి. కాకపోతే సినిమాయే ఎక్కుతుందో లేదో డిసెంబర్ 23 వరకు వేచి చూడాలి.
అన్నట్టు రవితేజ కూడా తన మిరపకాయ్ ఘాటు ఏంటో రుచి చూపించేది కూడా ఆరోజే మరి..!




Share your views...

0 Respones to "Will Nagarjuna remains in december success mood"

Post a Comment

 

© 2010 TollyTown All Rights Reserved Thesis WordPress Theme Converted into Blogger Template by Hack Tutors.info