Robo has given shock to tollywood



జల్ల కొట్టి పట్టుకుపోయిన రజిని కాంత్

అవసరం అయితే హీరోగానే కాదు , విలన్ గా నన్నా వచ్చి తన సత్తా ఏంటో చూపిస్తా అని రజిని అందరికి వార్నింగ్ ఇచ్చాడు. 

నలుగురు సీనియర్ హీరోలు(ఒకరు ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు), ఎనిమిదిమంది యంగ్ స్టార్ హీరోలు , చిన్నా చితక ఇంకో పదిమంది హీరోలు , నలుగురు స్టార్ తెలుగు డైరెక్టర్స్ ,ఇంకో నలుగురు తమిళ్ డైరెక్టర్స్ , అయిదు సూపర్ హిట్ నిర్మాతలు ఇంతమంది ఉండి కూడా ఒక డబ్బింగ్ సినిమా ఇక్కడి నుండి ఒక యాభై కోట్ల రూపాయలు పట్టుకు పోతుంటే చూస్తూ ఊరుకోవడం తప్ప ఇంకేం చెయ్యలేకపోయారు.

అవును మనం మాట్లాడుకోనేది రజిని , శంకర్ కాంబినేషన్ లో వచ్చిన రోబో గురించే. డెబ్బై ఎనిమిదేళ్ళ తెలుగు సినిమా చరిత్రలో ఈ ఏడాది భయంకరమైన అనుభవాన్ని మిగిల్చి వెళ్ళిపోయింది.ఎంతసేపు ఇమేజ్ పేరుచెప్పి , అభిమానుల పేరుతో అడ్డమైన సీన్లు చేసే మన హీరోలు రజిని ని చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. కథ, కథనాలను వదిలేసి కత్తుల చుట్టూ ఎప్పుడైతే తెలుగు సినిమా తిరగడం మొదలు పెట్టిందో అప్పుడే మన తిరోగమనం మొదలయ్యింది.

ఈ ఏడాది శంభో శివ శంభో తో మొదలు పెట్టిన ఫ్లాప్స్ పరంపరకు, నేను కూడా కొంచెం "పులి" లాంటి ఎనర్జీ ఇస్తా అని  "ఆరంజ్" కూడా తోడవ్వడంతో మొత్తానికి ఏదో అయ్యింది అనిపించింది. కొంతలో కొంత బాబాయ్ - అబ్బాయ్ లు   సింహా (?), అదుర్స్ బృన్దావనం, నాగవల్లి , లీడర్,   తండ్రి - కొడుకులు (ఏమాయ చేసావే, రగడ,) ఏదో ఓ మాదిరి హిట్ సాధించడంతో కొంచెమన్నా పరువు నిలబడింది.

అసలు మన హిట్ సినిమాలు చూసుకుంటే అవి కూడా హిట్టేనా అనిపించక మానదు. సమరసింహా రెడ్డి , నరసింహ నాయుడు , లక్ష్మి నరసింహా లతో పోలిస్తే నిజంగా సింహా హిట్టేనా అనేది అందరికి డౌటే. కాని బాలయ్య ముందు సినిమాలతో (ఒక్క మగాడు, వీరభద్ర, సీమ సింహం, పలనాటి బ్రహ్మ నాయుడు ) పోల్చుకుని ఇదే కొంచెం నయం అని నందమూరి అభిమానులు అందరు ఆనందపడ్డారు.

అదుర్స్ విషయానికి వస్తే ఎప్పుడో చిరంజీవి చేసి వదిలేసిన ముగ్గురు మొనగాళ్ళు కథ పట్టుకుని రెండు కారక్టర్లు కలిపి  కిచిడి కథ కలిపేసి వినాయక్ వదిలేసిన ఈ సినిమా జూనియర్ NTR చేసిన ముందు హిట్ సినిమాలతో పోల్చుకుంటే ఒక పక్కకి కూడా రాదనిపిస్తోంది. బృందావనం అయితే ఇక బావగారు బాగున్నారా, రాముడొచ్చాడు అనే సినిమాలు కలిపి తీసింది అనేది ఏ మాత్రం సినిమా పరిజ్ఞానం ఉన్నవాల్లకైనా తెలుస్తుంది. ఈ సరి జూనియర్ NTR కి వచ్చిన రెండు హిట్స్ కూడా చిరంజీవి పాత సినిమాలు (ఆ సినిమాల కథలను గుర్తుకు తేవడం )కావడం విశేషం .

ఇక అన్నయ్య కథలు తనకు పనికి రావనుకున్నాడో ఏమో, లేక తనకు సరిపోయే డైరెక్టర్స్ తెలుగు లో లేరనుకున్నాడో ఏమో , లేక తమిళం మీద మోజో తెలియదు కాని మోజు పది తెచుకున్న తమిళ్ డైరెక్టర్ నిలువునా మున్చేసాడు. అవును ఆ సూర్యుడు ని మింగడానికి ఆ పవన సుతుడు ప్రయత్నిస్తే , ఈ తమిళ సూర్యుడు మన పవన్ కళ్యాణ్ ఇమేజ్ తో బాటు నలభై కోట్లు కూడా నిలువునా మింగేసాడు.అసలు పవన్ కళ్యాన్ సినిమాల్లో కెల్లా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఖుషి ఇచ్చిన డైరెక్టర్ నుండి వచ్చిన సినిమా ఇంతలా ఉంటుంది అని ఏ కొణిదెల మేగాభిమాని ఊహించి ఉండడు. పులి మీద పుట్రలా మా బాబాయి కన్నా నేనేం తక్కువ కాదు అని వెనక అబ్బాయ్ బయలుదేరి ఓ రేంజ్ లో ఇచ్చిన షాక్ నుండి మెగాభిమానులు  తేరుకోవడానికి ఇంకో రెండు నెలలు  పడుతుంది.(అప్పటికి పవన్ లవ్లీ గాని, అల్లు అర్జున్ బద్రినాథ్ గని రావచ్చు. అసలు మేగాభిమానులకు మొదట షాక్ ఇచ్చిన ఈ వరుడు మొతానికి ఈ ఏడాది అసలు వరుడుగా మారాడు.)

ఆ దేవుడి కోసం తపస్సు చేస్తే వస్తాడో లేదో కాని, ఖలేజాలో దేవుడు మాత్రం తలుచుకోగానే వచ్చాడు. మూడేళ్ళ పాటు నిజంగానే మహేష్  అభిమానులు అందరు మహేష్ సినిమాకోసం తపస్సు చేసారు.అతిథి దేవో భవ అన్నారని మూడేళ్ళ ముందు అతిథి లా వచ్చా కదా అని ఈ సరి దేవుడి లా వస్తే విశ్వరూపాన్ని చూసి కళ్ళు మూసుకున్న అర్జునుడి లాగా మహేష్ అభిమానులు అందరు ఈ దేవుడుని మేము చూడలేము బాబోయ్ అని బయటకు పరిగెత్తారు. పక్కా కామెడి సినిమాను పట్టుకుని ఒక్కడు, అతడు , పోకిరి రేంజ్ లో బిల్డుప్ ఇవ్వడం తో theators కి వచ్చిన జనానికి అక్కడ ఏమి జరుగుతోందో అర్థం కాలేదు. అర్థం అయ్యేసరికి జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. త్రివిక్రమ్ మాట గాని , అనుష్క అందం గాని జన్నాన్ని ఆపలేకపోయారు. తను కూడా ప్రయత్నించి ఇక కుదరక తన తర్వాత సినిమా అయినా తొందరగా రావాలని మహేష్ "దూకుడు" గా పని చేస్తున్నాడు.

ఛత్రపతి తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం ప్రయత్నిస్తున్న ప్రభాస్ ను డార్లింగ్ అంటూ జనాలు బానే ఆదరించారు.

ఈ విధంగా మొత్తం ఈ ఏడాది ఫ్లాప్ సినిమాల మొత్తం 200 కోట్లు కాగా (పులి - 40 , ఖలేజా - 30 , వరుడు - 20 , ఆరంజ్ - 40 , నాగార్జున కేడి - 20 , శంభో శివ శంభో - 20 , సలీం - 23 , కాగా మిగిలిన చిన్న చితకా సినిమాల ఖరీదు - 20 ) ఒక్క రోబో వసూలు చేసిన మొత్తం 230 కోట్ల రూపాయలు కావడం విశేషం.అయితే ఈ మొత్తంలో మన స్టేట్ నుండి ఇచ్చినది ఓ యాభై కోట్లు ఉంటుంది అని అంచనా.

కనీసం ఈ వచ్చే ఏడు అయినా మన హీరోలు తమిళం వాళ్లకి దీటుగా సమాధానం ఇస్తే బావుండును.




Share your views...

0 Respones to "Robo has given shock to tollywood"

Post a Comment

 

© 2010 TollyTown All Rights Reserved Thesis WordPress Theme Converted into Blogger Template by Hack Tutors.info